* ఘనంగా "సీఎం పెళ్లాం" సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్* ఇంద్రజ, అజయ్ , జయసుధ , సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "సీఎం పెళ్లాం". ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు గడ్డం రమణా రెడ్డి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో "సీఎం పెళ్లాం" సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ - రాజకీయ నేపథ్యంతో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. దర్శకుడు గడ్డం రమణా రెడ్డి నాకు మిత్రులు. ఆయన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది అంటే విని ఇంప్రెస్ అయ్యాను. ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాను. సీఎంగా అజయ్, ఆయన భార్య పాత్రలో ఇంద్రజ నటన ఆకట్టుకుంటుంది. ఈ రోజు మా మూవీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశాం. హైదరాబాద్ నగరం గురించి చేసిన ఈ పాట మీ అందరికీ నచ్చుతుంది. త్వరలోనే మా సీఎం పెళ్లాం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు. నటుడు అజయ్ మాట్లాడుతూ - ఈ సాంగ్ చూశాక చాలా ఎమోషనల్ అయ్యాను. సీఎం...
we give exclusive cinema news and all major political news also