ఘనంగా రెయిన్ బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ చిల్డ్రన్స్ డే వేడుకలు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెయిన్ బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఈ నెల 10, 13, 14న చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. నవంబర్10న కుకట్‌పల్లి భారత్ వికాస్ పరిషత్ ఆడిటోరియంలో డ్యాన్స్, సింగింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించి విజేతలకు, పాల్గొన్నవారికి మెమొంటో, సర్టిఫికెట్‌ని అందజేశారు. 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చిల్డ్రన్ షార్ట్ ఫిలింస్ ప్రదర్శన ఏర్పాటు చేసి, అందులో ఉత్తమ షార్ట్ ఫిలింస్, ఉత్తమ బాల నటీనటులు, ఉత్తమ దర్శకుడిని ఎంపిక చేయడం జరిగింది. 14న రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ధియేటర్‌లో జరిగిన ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. రెయిన్ బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ జనరల్ సెక్రటరీ, బాలల చిత్రం అప్పూ దర్శకుడు కె. మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాగులపల్లి పద్మిని, నటుడు మేకా రామకృష్ణ, ’ఘర్షణ’ శ్రీనివాస్ రావు, రిటైర్డ్ ఎంఆర్‌ఓ బిక్కవల్లి సత్యానందం, ఆనంద్ సింగ్, నిర్మాత భద్రినాథ్, దాశరధి ఫిలిం సొసైటీ కార్యదర్శి బి.డి.యల్. సత్యనారాయణ, మేడిది సుబ్బయ్య ట్రస్ట్ ఫౌండర్
we give exclusive cinema news and all major political news also