*కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి *వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది* *10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది* *వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలి* *కేంద్రం తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలి* *టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి* వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు అని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందస్తుగా వరదలపై సీఎం కేసీఆర్ సమీక్షలు చేయకుండా ప్రగతి భవన్ ను చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఓ వైపు భారీ వర్షాలతో జనం అతలాకుతలం అవుతుంటే ఒకరు ఫామ్ హౌస్ లో, మరొకరు విందులు వినోదాలలో మునిగి తేలుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి. “రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది... సీఎం, మునిసిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయార
we give exclusive cinema news and all major political news also