ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

తెలంగాణ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

*కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

       *కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి       *వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా  విఫలమైంది* *10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది* *వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలి* *కేంద్రం తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలి* *టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి* వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు అని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందస్తుగా వరదలపై సీఎం కేసీఆర్ సమీక్షలు చేయకుండా ప్రగతి భవన్ ను చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఓ వైపు భారీ వ‌ర్షాల‌తో జ‌నం అత‌లాకుత‌లం అవుతుంటే ఒక‌రు ఫామ్ హౌస్ లో, మ‌రొక‌రు విందులు వినోదాల‌లో మునిగి తేలుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు రేవంత్ రెడ్డి. “రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది... సీఎం, మునిసిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయార

స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు, తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

  స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు,  తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.  తీవ్రభయాందోళనకు గురయిన పరిసర ప్రాంతాల ప్రజలు  ఎలాంటి అనుమతులు లేకుండా గోదాములు ఏర్పాటు రంగారెడ్డి :శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి గగన్ పహాడ్ లోని ఓ మెడివేస్ట్ స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.పేలుడు ధాటికి అందులో పనిచేస్తున్న పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు పోలీసులు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది.మంటలు ఆర్పి స్క్రాప్ దుకాణం లో చిక్కుకున్న వారిని రక్షించిన సిబ్బంది. గాయపడిన వారిలో అందరూ యువకులే. రాయల్, అస్లమ్, సద్దాం, అఫ్తాబ్, కమల్, సాహిల్, ప్రతాప్ సింగ్, మామా లను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.    స్క్రాప్ దుకాణం ఎస్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ యజమాని మహ్మద్ బాబుద్దీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాబుద్దీన్ గత కొన్నేళ్లుగా గగన్ పహడులో స్క్రాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా ఇటీవల కొంతకాలంగా

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరణ

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరణ తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ - 2023 కార్యక్రమం శనివారం సాయంత్రం 3:30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా.. ముఖ్య అతిథులుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, సీనియర్ సంపాదకులు ఐ. శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, సీనియర్ జర్నలిస్టులు, టీయూడబ్ల్యు నేత విరాహత్ అలీ, విజయకుమార్ రెడ్డి, జయసారథి రెడ్డి, వేణు నాయుడు, శ్రీనివాస్, తొలి వెలుగు రఘు, జర్నలిస్టులు అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి సాదిక్, సంయుక్త కార్యదర్శి మధు, కార్యదర్శి & కోశాధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా చేయలేని బాధ్యతను తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక చేస్తుంది -  విరాహత్ అలీ  ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి ..... భావ ప్రకటన స్వేచ్ఛ కు కేంద్రంగా తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిలిచిందని.. ఇది అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాను. : ఆకునూరి మురళి ......... సమాజంలో జర్నలిస్టుల బాధ్యత చాలా పెద్దది.  ప్రజాస్వామ్యం లో ఓపెన్ గా , ధైర్యంగా మాట్లా

రాష్ట్రంలో ప్రమాద రహిత నూతన సంవత్సర వేడుకలు. డిజిపి

సహకరించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు  హైదరాబాద్, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని  గత రాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన ప్రమాద సంఘటనలు  జరగలేదని, ఇందుకుగాను స్వీయ నియంత్రణతో ట్రాఫిక్ నిబందనలను పాటించి పోలీస్ శాఖ కు సహకరించిన  రాష్ట్ర ప్రజలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఎం. మహేందర్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటి నుంచి హైదరాబాద్ నగరంలో గాని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గాని   ప్రమాద సంఘటనలు జరగలేదని  తెలిపారు.  ఈ నూతన  సంవత్సర వేడుకలను  ప్రమాద రహితoగా నిర్వహించడంలో సమర్డవంతంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులు,సిబ్బందిని డీ.జీ.పీ అభినందించారు.  సీ.ఎం. కే.సీ.ఆర్ ను కలసిన డీ.జీ.పీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ ను  నేడు ప్రగతి భవన్ లో డీ.జీ.పీ. మహేందర్ రెడ్డి కలసి శుభాకాంక్షలు అందచెసారు. నేడు ప్రగతి భవన్ లో సీ.ఎం కె.సీ.ఆర్ ను కలసి పుష్పగుచ్హం అందచేసారు. అనంతరం గవర్నర్ తమిళ సై ను కూడా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందచేసారు. కాగా, నెడు ఉదయం పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో న

పోలీసులు ఎగిరి, ఎగిరి తన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా  నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉత్సాహంలో మునిగిన కొంతమంది యువతను అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. కొత్త సంవత్సర వేడుకల్లో కొంతమంది యువకులు పార్టీలు చేసుకొని ఇండ్లలోకి వెళ్తున్న క్రమంలో రోడ్లపై ఉన్న పోలీసులు అడ్డుకొని చితకబాదారు. కర్రలతో దాడి చేయడంతో పాటు, కొంతమంది పోలీసులు ఎగిరి, ఎగిరి తన్నిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మత్తులో ఉన్న యువకులు ఒకవేళ దురుసుగా ప్రవర్తిస్తూ, వారి ఇంటికి గాని లేదా పోలీస్ స్టేషన్ కు గాని తరలించాల్సి ఉన్నప్పటికీ చేయి చేసుకోవడం ఫ్రెండ్లీ పోలీస్ కు అర్థం లేకుండా పోతుందని, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

*ఆర్టీసీ ఉద్యోగుల కు తీపి కబురు*

*ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు* *ఆర్టీసీ ఉద్యోగుల కు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

పల్లె ప్రగతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం సీఎం కేసీఆర్ 

పల్లె ప్రగతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: సీఎం కేసీఆర్  HYD:పల్లె ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష జనవరి1నుంచి గ్రామాల్లో ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ తనిఖీలు పల్లె ప్రగతి కార్యక్రమాల పురోగతి నాణ్యతపై..  స్క్వాడ్స్‌ తనిఖీలు చేస్తాయి-  స్క్వాడ్స్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి..  ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాయి  30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం జనాదరణ పొందింది ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం అధికారులు.. ప్రజా ప్రతినిధులు చూపించడంలేదని ఫిర్యాదులు  పనితీరు మెరుగు పరుచుకోని అధికారులు పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు జనవరి ఒకటో తేదీ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగనున్నాయనీ.. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల పురోగతిని వాటి నాణ్యతను  ఈ స్క్వాడ్స్ అకస్మికంగా తనిఖీచేసి ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నాయని.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతి పై  ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. స్వచ్చతకు అద్దం పడుతూ పచ్చనైన పరిశుభ్రమైన పల్లెల కోసం ప్రభుత్వం సెప్టెంబర్ మొదటివారం

ఉల్లిగడ్డల చోరీ..నా???

ఉల్లిగడ్డల చోరీ..నా??? ఉల్లిగడ్డల చోరీ..నా .!!! అవునా అని ఆశ్చర్యపోకండి.... వినడానికే  కాస్త కామేడి గా వున్నా  ఇది నిజం ఈవార్త ఇప్పుడు సోషల్ మీడియా  లో పిచ్చిపిచ్చి గా వైరల్ అవుతుంది    నెటిజన్లు తెగ చూసేస్తున్నారు  చిక్కడపల్లి దోమలగూడ లో అర్ధ రాత్రి సమయంలొ  ఎవరు లేరని కూరగాయల వ్యాపారి బండి నుండి 20 kgs ఉల్లిగడ్డలు చోరీ చేసి దర్జగా తీసుకెళ్తున్నాడు ఒ పోకిరి ఇంకేముంది అక్కడే వున్న  సిసి కెమెరా దృశ్యాల ద్వారాఅడ్డంగా బుక్కయ్యాయిడు పాపం....  

యాదాద్రి లడ్డూ ప్రసాదంలో  బొద్దింక

యాదాద్రి లడ్డూ ప్రసాదంలో  బొద్దింక లడ్డూ ప్రసాదం తయారీలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి  లడ్డూ ప్రసాదం తయారీలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయట పడింది  ఓ భక్తుడు కొన్న లడ్డూలో బొద్దింక రావడంతొ  భక్తులు మండిపడుతున్నారు  యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో హైదరాబాద్ చెందిన భక్తులు, కొనుగోలు చేసిన లడ్డు ప్రసాదంలో  బొద్ది0క) . ప్రత్యక్ష్యం  అవ్వడంతో  భక్తులునివ్వెరపోయారు ...లడ్డు ప్రసాదంలో పురుగు వచ్చినట్టు తెలిపిన భక్తులు, అయితే ఆలయ అధికారులు... మాత్రం తమకు ఎలాంటి పిర్యాదు అందలేదని  చెబుతున్నారు  స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఎంతో ఇష్టంతో విక్రయం జరిపే ప్రసాదంలో ఇలా పురుగులు రావటం తో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా ప్రసాదంలో బోద్ధింకలు రావడం గతంలో ఇనుప ముక్కలు కూడా వచ్చాయి అయినా ఆలయ అధికారులు తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తన్నాయి..

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు సీఎం కేసీఆర్‌ లేఖ 

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు సీఎం కేసీఆర్‌ లేఖ  పార్లమెంటులోనూ, బయటా దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ, వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ...తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రెవెన్యూ, ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం సమీక్షలో ప్రస్తావించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా తక్కువగా వచ్చిందని సీఎం తెలిపారు..పన్నుల వాటా ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు.  రాష్టానికి  రావాల్సిన కేంద్ర పన్నుల వాటా  తగ్గిందని సీఎం సమావేశంలో అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని సీఎం తెలిపారు. పన్నుల వాటా గణనీయంగా తగ్గినందున అన్ని శాఖలకు నిధులు తగ్గించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఖర్చులపై అన్ని శాఖల్లోనూ స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం సూచించారు .

ప్రియాంకరెడ్డి ఉదంతంపై సిఎం ఆవేదన: 

ప్రియాంకరెడ్డి ఉదంతంపై సిఎం ఆవేదన:  ఆర్టీసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి, తీవ్ర ఆవేదన చెందారు. మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు వద్దని చెప్పారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని కలత చెందారు. ఇది దారుణమైన అమానుషమైన దుర్ఘటనగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం :  ఆర్టీసి కార్మికులతో సీఎం కేసిఆర్ ఆత్మీయ సమావేశం... ఆద్యంతం ఉద్వేగ భరితంగా జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన సీఎం ఆత్మీయ ప్రసంగం.. అత్యంత మానవీయ కోణం లో సాగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా స్పందించారు. సభలో ప్రతి ఒక్కరి కన్నుల్లో ఆనంద భాష్పాలు నింపాయి. నడుమ నడుమ సీఎం విసిరిన ఛలోక్తులు సందర్భోచిత సామెతలు సమావేశంలో ఉన్న ప్రతివొక్కరిని కడుపుబ్బ నవ్వించాయి.  ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం సిఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నరు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ కరతాళ ధ్వనులు హర్షాతిరేకాలతో సమావేశమందిరం దద్దరిల్లింది. సిఎం తమకోసం, తమ పిల్లలకోసం, తమ కుటుంబాల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు ఉద్యోగుల హృదయాల్లో  ఆనందం చప్పట

ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్‌ వరాల జల్లు

ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్‌ వరాల జల్లు ఆర్టీసీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాలు :  1ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలి.  2.ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తాం.  3.ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తాం 4.ఉద్యోగులు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తాం 5.సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం. 6.వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం.  7.ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును  58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం. 8.ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుంది. 9.సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణీకుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము.  10.కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేర

cm kcr ఆర్టీసీ కార్మికులంతా రేపు విధుల్లో చేరండి సీఎం కేసీఆర్‌

ఆర్టీసీ కార్మికులంతా రేపు విధుల్లో చేరండి సీఎం కేసీఆర్‌ కార్మికులు విధుల్లో చేరేందుకు ఎలాంటి కండీషన్లు పెట్టం యూనియన్ల ఉన్మాదంలో పడి..  కార్మికులు బతుకులను ఆగం చేసుకోవద్దు కార్మికులు ఉద్యోగాలు కాపాడు కోండి  ఆర్టీసీకి రూ.100 కోట్లు ఇస్తున్నాం ఆర్టీసీ ఛార్జీలు పెంచుకోవచ్చు - కి.మీ 20పైసలు చొప్పున పెంచుకోవచ్చు రూట్ల పర్మిట్లను వ్యాపారులకు ఇవ్వం - నేరుగా ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం - ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలే చనిపోయిన కార్మికుల కుటుంబాల నుంచి.. అర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తాం  యూనియన్లకు బదులుగా..  వర్కర్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ ఉండాలి  యూనియన్ల ఉన్మాదంలో పడి..  కార్మికులు బతుకులను ఆగం చేసుకోవద్దు యూనియన్లకు బదులుగా..  వర్కర్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ ఉండాలి ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రికే చంద్రశేఖరరావు శుభ వార్త అందించారు. రేపు విధుల్లో సంతోషంగా చేరాలని ఆదేశించారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరొచ్చని తెలిపారు   ఆర్టీసీ ప్రైవేటుపరం చేయబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కోలుకునేందుకు తాత్కాలికంగా వంద కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కార్మిక సంఘ

కారు ప్రమాదం పై హీరో సంపూర్ణేష్ ఏమన్నారంటే

సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కు తప్పిన ప్రమాదం...సంపూర్ణేష్ బాబు కారు ను ఢీ కొన్న ఆర్టీసి బస్సు... ప్రమాదం సమయంలో కుటుంబ సభ్యుల తో ఉన్న హీరో సంపూర్ణేష్ తో సహా.. భార్య, కూతురు కు స్వల్ప గాయాలు, ..

ఆర్టీసీ జెఎసి చేసిన ప్రకటన హాస్యాస్పదం.....ఆర్టీసీ   యండి సునీల్ శర్మ

ఆర్టీసీ జెఎసి చేసిన ప్రకటన హాస్యాస్పదం.....ఆర్టీసీ   యండి సునీల్ శర్మ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను  అడ్డగిస్తే కఠిన చర్యలు   52  రోజులు సమ్మే చేసి రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఎసి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది.  ఆర్టీసీ   యండి సునీల్ శర్మ మండి పడ్డారు...తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై,ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం ఏంటని  సునీల్ శర్మ ప్రశ్నించారు ...బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారంటూ తీవ్రంగా తప్పు పట్టారు...రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని, బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను  అడ్డగించవద్దని .  ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు..అన్ని డిపోల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తామని తెలిపారు..కార్మికులు ఇప్పుడు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటా

ఆర్టీసీ సమ్మెవిరమణ   అశ్వద్దామ రెడ్డి.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్,

  ఆర్టీసీ సమ్మెవిరమణ   అశ్వద్దామ రెడ్డి.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ నైతిక విజయం మనదే.. కార్మికులు ఓడిపోలేదు ఆర్టీసీ కార్మికులు 52రోజులు సుదీర్ఘ పోరాటం చేసిసమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్  అశ్వద్దామ రెడ్డి..  నిర్భందాలు చేసినా పోరాటం విజయవంతం చేసారు..నైతిక విజయం మనదే.. కార్మికులు ఓడిపోలేదు..రేపు ఉదయం 6గంటలకు డిపోల వద్దకు చేరి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు తాత్కాలిక కార్మికులు ఎవరూ దయచేసి డిపోల వద్దకు రాకండి..విధులకు  తీసుకోక పోతే ఉదృతంగా పోరాటం కొనసాగిస్తాం..ఉద్దేశ్య పూర్వకంగా సంస్థ లో అంతర్గతంగా మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు...ఉద్దేశ్య పూర్వకంగా సంస్థ లో అంతర్గతంగా మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు...అమరవీరుల కుటుంబాలను జేఏసీ అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తాం...మా పోరాటం కొనసాగుతోంది.. సమస్యల పరిష్కారం అయ్యేవరకు పోరాడుతాం

షరతులు లేకుండా విదులకు  ఆహ్వానిస్తే సమ్మె విరమించడానికి సిద్దం......అశ్వద్ధామ రెడ్డి .. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్

షరతులు లేకుండా విదులకు  ఆహ్వానిస్తే సమ్మె విరమించడానికి సిద్దం.......అశ్వద్ధామ రెడ్డి . ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ప్రభుత్వం షరతులు లేకుండా విదులకు  ఆహ్వానిస్తే సమ్మె విరమించడానికి సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి  .. తెలిపారు ఎలాంటి షరతులు లేకుండా కార్మికుల ను విదుల్లోకి తీసుకోవాలని  ..అశ్వద్ధామ రెడ్డి  కోరారు  షరతులు లేని చేరికలు మా ప్రధాన డిమాండ్.గా షరతులు లేని విదులకు ఆహ్వానించాలని కోరుతున్నామన్నారు సమస్యలను లేబర్ కోర్ట్ పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందదన్నారు   సమ్మె కాలానికి జీతాల విషయాన్ని లేబర్ కోర్ట్ లో లేవనెత్తుతాం... ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచన రాలేదు.. ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నామని ఆశాబావం వ్యక్తం చేశారు  

చెన్నమనేని రమేష్ కు  భారత పౌరసత్వం రద్దు

చెన్నమనేని రమేష్ కు  భారత పౌరసత్వం రద్దు   వేములవాడటీఆర్ఎస్  ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు  భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన జారిచేసింది     చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని ఎన్నికల్లో పోటి చేయడాని అర్హుడు కాదని  హోమ్ శాఖకు ఆది శ్రీనివాస్  గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే  అప్పటి నుంచి భారత పౌరసత్వంపై  పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా చెన్నమనేనికి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వానికి అనర్హుడంటూ హోంశాఖ  ప్రకటించింది  ఆయన  భారత పౌరుడు కాదని ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని కేంద్ర హోమ్ శాఖ స్పష్టం చేసింది..

దీక్ష విరమించిన ఆర్టీసీ జేఏసీ నేతలు

దీక్ష విరమించిన ఆర్టీసీ జేఏసీ నేతలు  ఆర్టీసీ జేఏసీ నేతలు చేపట్టిన నిరవధిక దీక్షను విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఇద్దరి చేత విపక్ష ఆర్టిసీ  జేఏసీ నాయకులు.నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. కాగా 19న నిర్వహించతలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు.  అయితే యథావిదిగా డిపోల వద్ద రేపు నిరసన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 

అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు.   గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.  మరోవైపు  అశ్వత్థామరెడ్డిని బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తరలించే సమయంలో  పోలీసులకు ఆర్టీసీ కార్మికులు మద్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో  ఇరువర్గాల మద్య తోపులాట చోటుచేసుకుంది.   దీంతో అశ్వత్థామరెడ్డిని ఆయన నివాసం నుంచి పోలీస్‌ వాహనంలో   వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు