డియర్ ఉమ రివ్యూ.. గొప్ప సందేశాన్నిచ్చే చిత్రం
ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వాలని ఉమా (సుమయ రెడ్డి) పల్లెటూరు నుంచి సిటీకి వస్తుంది. ఆయుష్ మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అవుతుంది. మరోవైపు దేవ్ (పృథ్వీ అంబర్) రాక్ స్టార్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రేమలో విఫలం అవ్వడంతో తాగుడుకు బానిసై దేని మీదా కాన్సర్టేట్ చేయలేక పోతాడు. దేవ్ చెడిపోతోన్నాడని ఆగ్రహం వ్యక్తి చేసి అతని తండ్రి ఇంట్లోంచి గెంటేస్తాడు. అక్కడా ఇక్కడా కష్టపడుతున్న దేవ్‌కి ఓ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో గుండెకు గాయం అవుతుంది. ఉమ చదువుతున్న ఆయుష్ హాస్పిటల్లోనే దేవ్‌ని జాయిన్ చేస్తారు. అదే హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌గా ఉమ పనిచేస్తుంది. అక్కడే దేవ్ అన్నయ్య సూర్య (కమల్ కామరాజ్) కూడా అడ్మినేస్ట్రటర్ కూడా పని చేస్తాడు. అయితే ఆ హాస్పిటల్ నుంచి దేవ్ డిశ్చార్జ్ అయిన తరువాత ఆర్ట్ గ్యాలరీలో పని చేస్తుంటాడు. ఆ టైంలోనే ఉమతో దేవ్‌కి పరిచయం ఏర్పడుతుంది. ఉమతో కొన్ని రోజుల ప్రయాణం తర్వాత దేవ్ ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. దేవ్ తెలుసుకున్న నిజం ఏంటి?.. అసలు ఉమకి ఏమైంది?.. ఉమ కోసం దేవ్ ఏం చేశాడు? అన్నది కథ.
ఉమ పాత్రలో సుమయ రెడ్డి చక్కగా నటించింది. ఇక నిర్మాతగా, రచయితగా, నటిగా సుమయ రెడ్డి తన వంతు న్యాయం చేసింది. అందరినీ కదిలించే, అవగాహన కల్పించే, మేల్కొపే కథను రాయడంలో సుమయ సక్సెస్ అయింది. ఎమోషన్స్ పలికించడంలో, తెరపై అందంగా కనిపించడంలోనూ సుమయ రెడ్డి తన మార్క్ వేసింది. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ యాక్టింగ్ బాగుంటుంది. అజయ్ ఘోష్ పాత్ర మెప్పిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.
"డియర్ ఉమర్" సినిమా చూసిన తర్వాత వైద్య రంగంపై ఒక రకమైన ఆలోచన కలుగుతుంది. సినిమాలో చూపించిన అన్యాయాలు నిజంగా కలచివేసేలా ఉన్నాయి. సాయి రాజేష్ ఈ కథను చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండటం మెచ్చుకోదగ్గ విషయం. రధన్ సంగీతం సినిమా యొక్క భావోద్వేగాలను మరింత పెంచింది. రాజ్ తోట కెమెరా పనితనం చాలా సహజంగా అనిపించింది, సినిమా చూస్తున్నంతసేపు ఒక నిజమైన ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే అయితే అద్భుతం! ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సీన్స్ నన్ను షాక్‌కు గురిచేశాయి. క్లైమాక్స్‌లోని పాట సినిమా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. సినిమా చూసిన తర్వాత ఒక మంచి సందేశాన్ని అందుకున్నాననే భావన కలిగింది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇక సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మాతగా తొలి ప్రాజెక్టునే గొప్పగా నిర్మించి సుమయ రెడ్డి సక్సెస్ అయిందని చెప్పొచ్చు.
రేటింగ్ : 3/5
కామెంట్‌లు