ఆకట్టుకుంటున్న ఓరి పిల్లడా సాంగ్
తెలుగు సినీ, మ్యూజిక్ లవర్స్ టేస్ట్ మారుతుంది. క్లాస్ మ్యూజిక్, ఇప్పుడు బోర్ కొడుతోంది. పాప్ సాంగ్స్ కన్నా, ఫోక్ సాంగ్స్ మీద మనసుపారేసుకుంటున్నారు జనాలు. పార్టీ సాంగ్స్ కన్నా మసాలా బీట్స్ కే ఎక్కువ ఎట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. అందుకే ఈ మద్య కంపోజర్స్ అందరూ ఫోక్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన మ్యూజిషియన్స్ మాస్ మసాలా బీట్స్ మీద బాగా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఆడియన్స్ లో కాస్త జోష్ నింపేందుకు ఫోక్ మీద ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా వెంకీ రొంపెల్లి నాయకుడిగా శిల్పా యాదవ్ నాయికగా ఓరి పిల్లడా అంటూ సాగుతున్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు. జేహెచ్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నోమిక నిర్మాతగా వ్యవహరించిన ఈ సాంగ్ ని గాయత్రి ఆలపించారు. అర్మాన్ మెరుగు లిరిక్స్ అందించడంతో పాటు సంగీతం అందించిన ఈ సాంగ్ కి కమ్లీ పటేల్ కెమెరా హ్యాండిల్ చేయగా నమృత్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ సాంగ్ ఆద్యంతం శ్రోతలను మాత్రమే కాదు వీక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.. బోడుప్పల్ పిల్ల యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేయబడిన ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వెళుతోంది. ముఖ్యంగా సాంగ్ లో ఉన్న విజువల్స్ అయితే మంచి గ్రీనరీ తో ఇన్స్టంట్ ప్లేసెంట్ ఫీలింగ్ కలిగిస్తున్నాయి. అలాగే లిరిక్స్ కూడా ఆకట్టుకునేలా ఉండడం గమనార్హం. ఇక శిల్పా యాదవ్ వెంకీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. అది స్క్రీన్ మీద చాలా మంచి ఫీల్ కలిగిస్తోంది.
నిర్మాత: నోమిక
నటీనటులు: శిల్పా యాదవ్, వెంకీ రొంపెల్లి
గాయని: గాయత్రి
సాహిత్యం & సంగీతం: అర్మాన్ మెరుగు
కెమెరా: కమ్లీ పటేల్
కొరియోగ్రాఫర్: నమృత్
ఎడిటింగ్ & DI: శ్రీనివాస్
ప్రొడక్షన్: జేహెచ్ఆర్
కామెంట్‌లు