ఘనంగా ఆర్జీవీ 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 4వ తేదీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
ఘనంగా ఆర్జీవీ 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 4వ తేదీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కొత్త సినిమా 'శారీ'. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. 'శారీ' సినిమా ఈ నెల 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డైరెక్టర్ గిరికృష్ణ కమల్ మాట్లాడుతూ - 'శారీ' సినిమాకు టాలెంటెడ్ న్యూ టీమ్ వర్క్ చేసింది. మా అందరితో మూవీకి కావాల్సినట్లు వర్క్ చేయించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. సినిమాకు కావాల్సిన కంటెంట్ మా ద్వారా తీసుకున్నారు. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో సినిమా ఎలా చేయాలి అనేది ఆయన నాకు ఎప్పుడూ చెప్పలేదు. రెండు పాత్రలతోనే ప్రధానంగా సాగే ఇంటెన్స్ డ్రామా ఇది. ఆ రెండు క్యారెక్టర్స్ లో సత్య యాదు, ఆరాధ్య దేవి బాగా నటించారు. సత్య క్యారెక్టర్ రెగ్యులర్ హీరోలా ఉండదు, అలాగే ఆరాధ్య అంత అందంగా కనిపిస్తున్నా, తను ఈ మూవీలో కొన్నిసార్లు డీ గ్లామర్ గా ఉంటుంది. వర్మ గారితో వర్క్ చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతమ్ మాట్లాడుతూ - రామ్ గోపాల్ వర్మ గారు న్యూ టాలెంట్ కు దొరికిన అదృష్టం అని చెప్పాలి. ఆయనతో గులాబి సినిమా నుంచి వర్క్ చేస్తున్నా. రెగ్యులర్ గా ఆయనను కలుస్తుండేవాడిని. 'శారీ' మూవీకి మరోసారి ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. నా సాంగ్స్ అన్నీ ఆర్జీవీ గారికి అంకితమిస్తున్నా. ఆయన ఎప్పుడు మూవీ కోసం పిలిచినా రెడీగా ఉంటాను. అన్నారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి అనే పాయింట్ మీద చేసిన చిత్రమే 'శారీ'. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. నేను చేసిన స్క్రిప్ట్ కంటే చాలా గొప్పగా దర్శకుడు గిరికృష్ణ కమల్ మూవీని రూపొందించాడు. కమల్ నాతో చాలా కాలంగా జర్నీ చేస్తున్నాడు. నా మూవీస్ కు వర్క్ చేశాడు. తనతో ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేసినప్పుడు అతని ఆలోచనలు నచ్చి మూవీ డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాను. కథ రాసినప్పుడు నేను ఊహించుకున్న దాని కంటే బాగా మూవీని రూపొందించాడు. డీవోపీ శబరి, మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతమ్..ఇలా నా టీమ్ అంతా 'శారీ' సినిమాకు మంచి ఔట్ పుట్ ఇచ్చారు. డీవోపీ శబరి సినిమా మూడ్ ను తన విజువల్స్ ద్వారా క్రియేట్ చేయగలిగాడు. శశిప్రీతమ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం మంచి సాంగ్స్ చేశాడు. సినిమాలోని ఎస్సెన్స్ ను తన మ్యూజిక్ ద్వారా రిఫ్లెక్ట్ చేశాడు శశిప్రీతమ్. సినిమాలోని మూడు పాటలకు సుభాష్ మంచి కొరియోగ్రఫీ చేశాడు. శారీ సినిమాకు టాలెంటెడ్ టీమ్ వర్క్ చేసింది. నా కంటే వాళ్ల కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకు ఎక్కువగా ఉందని చెప్పగలను. అన్నారు.
హీరోయిన్ ఆరాధ్య దేవి మాట్లాడుతూ - 'శారీ' సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ గారికి థ్యాంక్స్. ఈ సినిమా నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ పాత్రలో నటించేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణకమల్. ఈ సినిమా చేయడం నాకొక వర్క్ షాప్ లా అనిపించింది. సత్య యాదు మంచి కోస్టార్. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. 'శారీ' సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈ నెల 4న థియేటర్స్ లోకి వస్తున్న 'శారీ' సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో సత్య యాదు మాట్లాడుతూ - మీ అందరి సమక్షంలో 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా కోసం ఆర్జీవీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఈ సినిమా ఒక ఇంటెన్స్ డ్రామాతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తక్కువ పాత్రలు అయినా ఎఫెక్టివ్ గా ఉంటాయి. నా పర్ ఫార్మెన్స్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. అలాగే ఆరాధ్య కూడా సూపర్బ్ గా నటించింది. దర్శకుడు గిరికృష్ణ కమల్ కు, రామ్ గోపాల్ వర్మ గారికి థ్యాంక్స్. ఈ నెల 4న మీరంతా మా 'శారీ' సినిమా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు : సత్యా యాదు, ఆరాధ్య దేవి, సాహిల్ సంభవాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ : ఆర్జీవీ – ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ
సినిమాటోగ్రఫీ : శబరి
మ్యూజిక్ : శశిప్రీతమ్
నిర్మాత : రవి శంకర్ వర్మ,
దర్శకుడు : గిరి కృష్ణ కమల్
పీఆర్ఓ - రాంబాబు వర్మ
కామెంట్‌లు