ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91 వ జయంతి





 






ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 
 91 వ జయంతి 

ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌.  తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934  , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు .  నేడు ఆయన 91వ జయంతి . 

శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర  నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం సాధించారు . ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు . అది మంచి విజయం సాధించింది .తదుపరి చిత్రం కళా తపస్వి కే. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం . తెలుగు చిత్ర ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకు వెళ్లిన అద్భుత కావ్యం . ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు , box office కలెక్షన్స్ గాని , జాతీయ - అంతర్జాతీయ - రాష్త్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే , అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం . అలాగే ఏ దేశమెళ్ళెనా, శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో .ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ఇన్స్పిరేషన్ . ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది . ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కే.విశ్వనాధ్ కాంబినేషన్ లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . అవార్డులు తో పాటు రివార్డులు సొంతం చేస్కుకున్నదీ చిత్రం . తెలుగు, తమిళం & మలయాళం లో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది . తదుపరి చిత్రం మరో క్లాసిక్ - సితార . ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ever green classic . సితార కి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది .ఇక స్వాతిముత్యం - కే.విశ్వనాధ్ ,కమలహాసనన్‌,  రాధిక ల కలయిక లో వచ్చిన ఆణిముత్యం . 1986 లో విడులయ్యిన ఈ చిత్రం , అప్పటికి బాక్స్ ఆఫీస్ records ని బీట్ చేసింది . జాతీయ అవార్డు , రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం . ఇక స్వయంకృషి - మెగాస్టార్ చిరంజీవి తో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా , ఓ సాధారణ చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే . అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద . మంచి విజయం సాధించిన ఈ చిత్రం , చిరంజీవి కి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది .ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరో గా చేసిన స్వరకల్పన ఆశించనంతగా ఆడలేదు . మళ్ళీ విశ్వనాధ్ - చిరంజీవిలతో తీసిన చిత్రం , ఆపత్బాంధవుడు . చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ . రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు .అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచంలో మిస్ అయ్యింది . 
తీసిన 10 సినిమాలు కళా ఖండాలే... అదుపు తప్పిన సినిమాలకు "కాపు" కాసిన నిర్మాతకు గుర్తింపు ఏది?
మంచి చిత్రాలు నిర్మించాలంటూ తరుచూ చెప్పే ప్రభుత్వం ఇన్ని మంచి చిత్రాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావును ఏ రీతిన గౌరవించింది? అని ప్ర‌శ్నించుకుంటే.. కనీసం పద్మ శ్రీ‌ కూడా ఇవ్వలేదు. తెలుగు సినిమాకు తొలి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన నిర్మాత ఆయన. దాదా సాహెబ్ పాల్కే అవార్డు కు నామినేట్ అయ్యారు, కానీ అవార్డు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా సినీ రాజకీయాల మూలాన రాలేదు. మంచి చిత్రం కోసం కోట్లాది రూపాయలు పణంగా పెట్టిన ఒక గొప్ప నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కిందా? అన్న‌ది ట‌న్ను బ‌రువైన ప్ర‌శ్న‌. కనీసం మరణానంతరం ఇవ్వగలిగిన పురస్కారాలు ‌ఇవ్వచ్చు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లోనైనా, ఆయనకి రఘుపతి వెంకయ్య అవార్డు, లేక ప్రత్యేక అవార్డు ఏదైనా ప్రకటిస్తే బాగుంటుంద. కళా సాగర్  వారు దశాబ్తపు ఉత్తమ నిర్మాత గా అవార్డునిచ్చి గౌర‌వించారు. సంగం అకాడమీ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌, `సంతోషం` లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో స‌త్క‌రించి గౌర‌వించాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య...