"శివ శంభో చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈటెల రాజేంద్ర"
"శివ శంభో చిత్ర యూనిట్ కి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఈటల "
"ఏప్రిల్ 18న శివ శంభో చిత్ర విడుదల"
అనంత ఆర్ట్స్ పతాకంపై
బొజ్జ రాజగోపాల్, సుగుణ దోరవేటి నిర్మించిన
సంగీత సాహిత్య విలువలు కలిగిన భక్తి ప్రధానమైన చిత్రం *శివ శంభో* ఏప్రిల్ 18 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు ప్రకటించారు.
నర్సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ కళలైన సంగీతం సాహిత్యం నృత్యం ప్రధానాంశాలు గా కలిగిన సందేశాత్మక చిత్రమని ఇటువంటి చిత్రాలను ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రజలకు అన్నిరకాల శుభాలను ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరు, రచయిత, సంగీత దర్శకులు దోరవేటి మాట్లాడుతూ ఉత్తమాభిరుచి గల ప్రేక్షకులు తప్పకుండా తమ చిత్రాన్ని ఆదరిస్తారన్న విశ్వాసం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత బొజ్జ రాజగోపాల్, నటులు రమేశ్, బేబీ రిషిత, మేనేజర్ చిట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.
బ్యానర్ :అనంత ఆర్ట్స్
నిర్మాతలు : బొజ్జ రాజ గోపాల్ మరియు దోరవేటి సుగుణ, శ్రీశైలం రెడ్డి
డైరెక్టర్ :నర్సింగ్ రావు
డి ఓ పి: కారె సతీశ్ కుమార్
హీరో హీరోయిన్ :కృష్ణ ఇస్లావత్, కేశవర్థిని బేబీ రిషిత
పాటలు మాటలు , సంగీతం : దోరవేటి
ముఖ్యపాత్రలో : తనికెళ్ళ భరణి, సుమన్, టార్జాన్, విజయ్ రంగరాజన్, చిల్లర వేణు, రామస్వామి, రజాక్, మల్లేశ్, రవిరెడ్డి, రమేష్ యాదవ్, శ్రీకర్, విగ్నేష్,
కామెంట్‌లు