మహేశ్వరంలోని అన్ని గ్రామాలను ఫోర్త్ సిటీలో కలిపేంత వరకు పోరాటం ఆగదు సీనియర్ జర్నలిస్ట్ రఘుపతి
నూతన ఫోర్త్ సిటీ జేఏసీ ఏర్పాటు
నూతనంగా జేఏసీ చైర్మన్ గా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ రఘుపతికి సన్మానం
మహేశ్వరం లోని అన్ని గ్రామాలను ఫోర్త్ సిటీలో కలిపేంత వరకు పోరాటం చేస్తామని ఫోర్త్ సిటీ జేఏసీ చైర్మన్ గా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టు రఘుపతి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో రాజకీయ పార్టీలు నాయకులు మహేశ్వరం మండలాన్ని ఫోర్త్ సిటీలో కలిపేలా పోరాటం చేయాలని కార్యాచరణ రూపకల్పన కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి వచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పి, సిపిఐ సిపిఎం అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం కమిటీని ఏర్పాటు చేశారు. ఫోర్ సిటీ జేఏసీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు రాఘుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ….చారిత్రాత్మకమైన మహేశ్వరం మండల ప్రాంతం అన్ని రంగాల్లో వెనకబడి ఉందన్నారు.మనలో ఐక్యత లోపం నిర్లక్ష్యం కారణంగా మన కళ్ళముందే మన ప్రాంతంలో ఉన్న వివిధ పార్టీ కార్యాలయాలను ఇతర ప్రాంతాల తరలిస్తున్నారు. మనకు పదవులు ముఖ్యం కాదు ప్రాంతం ముఖ్యమన్నారు. మన మహేశ్వరానికి అన్యాయం జరగబోతుందన్నారు. ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలా వద్దా అనే అంశాన్ని చర్చించడం జరిగిందన్నారు. మన ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగిన సీనియర్ రిపోర్టర్ దోమ యాదగిరి రెడ్డి మన ప్రాంతం గురించి మన ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశాన్ని గురించి ఇంత చక్కగా మాట్లాడడం జరిగిందన్నారు. ఈ ప్రాంతానికి ఎక్కడ వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు మన ఓటు వేసుకొని ఉన్నత పదవులు పొంది మన ప్రాంతానికి నష్టం చేశారని హలో బాధతో ఆవేదనతో చెప్పడం జరిగింది అన్నారు. సుభాన్ పూర్ గోపాల్ రెడ్డి మన ప్రాంతం గురించి మాట్లాడే వ్యక్తి చూసిన అనంతరం ప్రస్తుతం యాదగిరి రెడ్డిని చూస్తున్నామన్నారు. పోరాటానికి ఊపిరిల్లుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. చీము నెత్తురు ఉన్న ప్రతి పార్టీ నాయకుడు కార్యకర్తలు ఫోర్త్ సిటీలో మన మండలాన్ని కలిపినంతవరకు పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. పోలీసులతో దెబ్బలు తిన్న జైలుకు వెళ్ళినా సరే మన ప్రాంత అభివృద్ధి కోసం మండల కేంద్రంలోని 32 గ్రామాలను ఫోర్త్ సిటీలో కలిపేంత వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ప్రాంత అభివృద్ధి కోసం ఎంతవరకు అయినా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో. మల్లేష్ యాదవ్. కాకీ ఈశ్వర్ ముదిరాజ్. లాజర్. కర్నాటి మనోహర్. బిజెపి మండల అధ్యక్షుడు యాదిష్. పాపయ్య గౌడ్. సుదర్శన్ రెడ్డి. రాజు నాయక్. కడారి జంగయ్య. మాజీ ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్. శ్రావణ్ కుమార్. గ్రామ శాఖ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్. ఆంజనేయులు గౌడ్. మాజీ సర్పంచ్ రమేష్. నరసింహ. దేశ నాయక్. దత్తు నాయక్. సుభాష్. నారాయణ. వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు .
బైట్: - మహేశ్వరం jac చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ రఘుపతి,
కామెంట్‌లు