Gen Z ఎంటర్‌టైనర్ ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’తో మెప్పించనున్న యంగ్ సెన్సేషన్ అంకిత్ కొయ్య
ఇటీవల విడుదలైన సూపర్ హిట్ అయిన ఆయ్, మారుతీనగర్ సుబ్రమణ్యం చిత్రాల్లో మెప్పించిన యంగ్ సెన్సేషన్ అంకిత్ కొయ్య మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. Gen Z ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. యువ నటుల్లో తనదైన నటనతో పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్న అంకిత్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా అది అందరి దృష్టిని ఆకర్షించింది. సత్య ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సత్య కోమల్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీహర్ష తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియా కొంతం కథానాయికగా నటిస్తుంది. టి సిరీస్ సంస్థ ఈ మూవీ ఆడియో రైట్స్‌ను సొంతం చేసుకుంది. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించేలా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేసేలా ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు.
‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ అనే టైటిల్‌తో రానున్న ఈ Gen Z ఎంటర్‌టైనర్‌కు వీడియోను గమనిస్తే అందులో శ్రియా కొంతంకు బాయ్ ఫ్రెండ్‌గా అంకిత్ కొయ్య కనిపిస్తారు. అలాగే హీరోయిన్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ కాకా అనే పాత్రలో వెన్నెల కిషోర్‌లను గమనించవచ్చు. ‘హీ కేమ్, హీ కాన్‌కర్డ్, హీ కుడన్ట్ లీవ్’ అనే వాటిలోనే అంకిత్ కొయ్య ఎదుర్కొన్న పరిస్థితులను వినోదాత్మకంగా వివరించే ప్రయత్నం చేశారు.
‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ చిత్రంలో అంకిత్ కొయ్య, శ్రియా కొంతం హీరో హీరోయిన్లుగా నటిస్తుంటే ఇక మిగిలిన ప్రధాన పాత్రల్లో ఇంద్రజ, వెన్నెల కిషోర్, ప్రశాంత్ శర్మ, లక్ష్మీ సుజాత, అశోక్ చంద్ర, నేహా కృష్ణ తదితరులు నటించారు. మార్క్ కె.రూబిన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి కె.సోమ శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ రాయ్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.
కామెంట్‌లు