హీరో చంద్రహాస్ చేతుల మీదుగా లాంఛ్ అయిన మారుతీ సుజుకీ డాజ్లింగ్ డిజైర్!
ప్రస్తుతం టాలీవుడ్ లో యాటిట్యూడ్ స్టార్ అంటే టక్కున గుర్తుకొచ్చేది చంద్రహాస్. ఈ హీరో నగరం లోని టోలిచౌకి లో ఉన్న షోరూం లో ఈ రోజు మారుతి సుజుకీ డాజ్లింగ్ డిజైర్ ని తన చేతుల మీదుగా ఘనం గా లాంఛ్ చేశారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న చంద్రహాస్ ఈ కార్ యొక్క ఫీచర్స్ గురించి, అలాగే కార్ యొక్క మోడల్ గురించి చాలా చక్కగా వివరించారు. అంతే కాదు కుటుంబ సభ్యులతో ప్రయాణం చేయడానికి అనుగుణంగా అన్ని రకాలుగా ఈ కార్ సరిగ్గా సరిపోతుందనీ.. ధర కూడా మనకి అందుబాటులో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ఉందని చెప్పారు..
రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ తనకు బాగా నచ్చింది అని చెప్తూ, తను చేయబోయే సినిమా కబుర్లు కూడా చెప్పుకొచ్చాడు..!!
కామెంట్‌లు