ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

"రామ్ నగర్ బన్నీ" లాంటి కంప్లీట్ ఎంటర్ టైనర్ నా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది -'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్





 *"రామ్ నగర్ బన్నీ" లాంటి కంప్లీట్ ఎంటర్ టైనర్ నా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది -'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "రామ్ నగర్ బన్నీ". విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన "రామ్ నగర్ బన్నీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తన ఇంటర్వ్యూలో తెలిపారు 'ఆటిట్యూడ్ స్టార్' చంద్రహాస్

- రామ్ నగర్ బన్నీ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా నా డెబ్యూ మూవీ కావడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఎంట్రీ మరొకరికి దొరుకుందని అనుకోను. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కు వస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎగ్జైటింగ్ గా ఉన్నాను. అయితే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనే కాన్ఫిడెన్స్ మా టీమ్ అందరిలో ఉంది.

- నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ గారు నా గురించి హీరో క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. అలాగే మా "రామ్ నగర్ బన్నీ" సినిమా చూసి మీకు నచ్చకుంటే నాకు మీ టికెట్ ఫొటోతో ఇన్ స్టా ద్వారా చెప్పండి మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పాను. సినిమా మీద నమ్మకంతోనే అలా అన్నాను.

- "రామ్ నగర్ బన్నీ" సినిమాలో నేను సూపర్ హీరోలా కనిపించను. ఒక సాధారణ యువకుడిగానే కనిపిస్తా. నేను తిట్లు తింటాను, అవమానాలు ఎదుర్కొంటాను. రకరకాల జాబ్స్ చేస్తాను. కొన్నిసార్లు జాబ్ లెస్ గా ఉంటాను. అన్నిరకాల ఎమోషన్స్ చేసే అవకాశం ఈ చిత్రంలో కలిగింది.

- "రామ్ నగర్ బన్నీ"  సినిమాను సకుటుంబంగా ఫ్యామిలీ ఆడియెన్స్ వెళ్లి చూడొచ్చు. ఒక పాటలో ముద్దు సీన్స్ ఉండేవి. అయితే అవి సెన్సార్ లో కట్ చేయించాం. కిస్సింగ్ సీన్స్ సినిమాలో ఉండవు. నలుగురు హీరోయిన్స్ ఉన్నారు మా మూవీలో. వాళ్ల క్యారెక్టర్స్ కు పర్ ఫార్మెన్స్ పరంగా మంచి స్కోప్ ఉంటుంది. అలాగే వాళ్లు అందంగా కనిపిస్తారు. నలుగురు హీరోయిన్స్ ను కథానుసారమే మా మూవీలో తీసుకున్నాం.

- "రామ్ నగర్ బన్నీ"  సినిమాను మా నాన్నగారు ప్రభాకర్ ప్రొడ్యూస్ చేశారు. ముందు నేను వద్దనే అన్నాను. ప్రొడక్షన్ రిస్క్ ఉంటుంది. అయితే ఈ కథను మనం అనుకున్నట్లు బాగా చేయాలంటే మనమే ప్రొడ్యూస్ చేయాలని నాన్న ముందుకొచ్చారు. నాన్న ఈ సినిమాలో ఓ చిన్న రోల్ చేశారు. ఆ టైమ్ కు ఆర్టిస్టు అందుబాటులో లేకుంటే నేనే చేస్తా అని నాన్న అన్నారు.

- దర్శకుడు శ్రీనివాస్ మహత్ నన్ను స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేశాడు. ఫైట్స్, డ్యాన్స్, లవ్, ఎమోషన్, రొమాంటిక్ ఇలా..అన్ని షేడ్స్ లో నన్ను చూపించారు. ఈ సినిమా తర్వాత నేను అన్ని ఎమోషన్స్, అన్ని జానర్స్ చేయగలను అనే పేరొస్తుంది. ఆటిట్యూడ్ స్టార్ అనేది నేను పెట్టుకున్నది కాదు. "రామ్ నగర్ బన్నీ"  సినిమా చూశాక నేను ఆ ట్యాగ్ కు అర్హుడిని కాదు అంటే తీసేస్తా. 

- నన్ను ట్రోల్ చేసే వారి గురించి ఇప్పటికే నా అభిప్రాయం చెప్పాను. ట్రోల్స్ వల్ల నేను పెద్దగా బాధపడలేదు. వాటిని పాజిటివ్ గా తీసుకున్నా. నేను సినిమాలు చేసేది నన్ను ఇష్టపడే ప్రేక్షకుల కోసం. వారికి నా నటన నచ్చితే చాలు అనుకుంటున్నా. మూ మూవీకి అశ్విన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతను అనిరుధ్ లా గుర్తింపు తెచ్చుకుంటాడని చెప్పగలను.

- నాకు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలని ఉంది. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి. అవకాశం వస్తే అన్ని జానర్ మూవీస్ లో నటిస్తా. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నా. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా  కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు.  ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.