ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏడిద నాగేశ్వరావు 9వ వర్ధంతి ,అక్టోబర్ 4న …








ఏడిద నాగేశ్వరావు 9వ వర్ధంతి ,అక్టోబర్ 4న …

తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు,
ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు.. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది. ఆయన ఎవరో ఏమిటోచూద్దాం.
తెలుగు సినిమా రంగానికి ఆయన ఓ ఆభరణం.. అలా శంకరశాస్త్రి దరిచేరి ‘శంకరాభరణ’మైంది. ‘స్వయంకృషి’తో హిట్టు కొట్టారు.. ‘సీతాకోక చిలుక’ను పట్టారు. ఎంతోమంది ‘సితార’లకు ‘అపద్బాంధవుడ’య్యారు. ఆ ‘స్వరకల్పన’ అనితర సాధ్యం.. ఆ ‘సిరిసిరి మువ్వల’ సవ్వడి అనన్యసామాన్యం. అందుకే సినిమా రంగానికి దొరికిన ‘స్వాతిముత్యం’ ఏడిద నాగేశ్వరరావు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అంటేనే ఓ స్వరఝరి.. ప్రత్యర్థులకు అలజడి. అక్టోబర్ 4న పూర్ణోదయా  మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు 9వ వర్ధంతి  సందర్భంగా ప్రత్యేక కథనమిది. 
అనేక కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ఘనత ఆయనది. సినిమా రంగంలో ఏదో సాధించాలని మద్రాసు రైలెక్కిన ఆయన కాలక్రమేణా అభిరుచి గల నిర్మాతగా మారతారని ఎవరూ ఊహించలేదు.
నాటకాల నుంచి సినిమాల వైపు
తూర్పుగోదావరి జిల్లా లోని కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్ 24న ఏడిద నాగేశ్వరరావు జన్మించారు. కాకినాడ మెటలారిన్‌ హైస్కూల్‌లో ఫిఫ్త్‌ ఫారమ్‌ చదువుతుండగా స్కూల్‌ వార్షికోత్సవంలో ‘లోభి’ అనే నాటకంలో తొలిసారిగా అమ్మాయి వేషం వేశారాయన. దానికి రజత పతకం అందుకోవడంతో నటనపై మక్కువ పెరిగింది. అలా నాటకాల వైపు జీవిత పయనం సాగింది. అది ఎక్కడిదాకా వెళ్లింది అంటే మద్రాసు రైలెక్కి చెన్నపట్నం చేరేదాకా వెళ్లింది. చిన్నాచితకా వేషాలు వేస్తూ బతుకు బండి సాగించారు. భుక్తి కోసం డబ్బింగ్ కూడా చెప్పాల్సి వచ్చింది. కొంతమంది స్నేహితుల ప్రోత్సాహంతో గీతాకృష్ణా కంబైన్స్ బ్యానర్ మీద ‘సిరిసిరి మువ్వ’ చిత్ర నిర్మాణాన్ని 1976లో చేపట్టారు. ఆ సినిమా ఘనవిజయంతో ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి ‘తాయారమ్మ బంగారయ్య’ నిర్మించారు . అది కూడా ఘనవిజయం సాధించింది. కళా తపస్వి కె. విశ్వనాధ్ తో సిరిసిరి మువ్వ నుంచి ఉన్న అనుబంధం ‘శంకరాభరణం’ వైపు దారి చూపింది. దాంతో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. అటు కలెక్షన్ల పరంగా ఇటు సంగీతపరంగా ఆ సినిమా సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లో ఏ నోట విన్నా శంకరాభరణం మాటే.. ఏ చోట విన్నా బాలు పాటే.
హిట్ల బాటలో నిర్మాతగా పయనం
ఆ తర్వాత ‘సీతాకోకచిలుక’ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . అనేక ప్రేమ కథా చిత్రాలకు ఇది ప్రేరణ అనడం కూడా అతిశయోక్తి కాదు. ఆయన ఏ చిత్ర నిర్మాణం చేపట్టినా అది హిట్ల బాటే. కమలహాసన్, కె.విశ్వనాధ్ కాంబినేషన్ లో ‘సాగర సంగమం’ మరో  క్లాసికల్ మూవీ అయ్యింది. కమల్ నటనకు జనం నీరాజనం పట్టారు. తెలుగు, తమిళం, మలయాళం లో ఒకే సారి విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ‘సితార’కు శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా తన వద్ద అనేక చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చి మరీ ఈ సినిమా నిర్మించారు. సుమన్, భానుప్రియ జంటగా రూపొందిన ఆ సినిమా కూడా మరో క్లాసిక్ . జాతీయ అవార్డును సైతం సాధించిపెట్టింది. 
‘ స్వాతిముత్యం’ గురించి ప్రత్యేకించే చెప్పే పనే లేదు. కమల్ హాసన్, రాధిక జంటగా రూపొందిన ఈ సినిమాకి విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 1986లో విడుదలైన ఈ సినిమా అన్ని రికార్డులనూ తిరగరాసింది. అటు జాతీయ అవార్డు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును సైతం ఈ సినిమా సంపాదించి పెట్టింది. అంతేకాదు అంతర్జాతీయ అవార్డు అయిన ఆస్కార్ కు మన దేశం తరఫున ఎంపికైన ఘనత కూడా ఈ తెలుగు సినిమా దక్కించుకుంది. ఆయన నిర్మించిన ప్రతి సినిమా ఓ క్లాసిక్ అనే చెప్పాలి. అలాగని కమర్షియల్ అంశాలను కోల్పోలేదు. క్లాసికల్ గా ఈ తరహా కమర్షియల్ తీయవచ్చని ఏడిద నాగేశ్వరరావు నిరూపించారు. అప్పటిదాకా ఆయన కమల్ హాసన్ తోనే ఎక్కువగా సినిమాలు చేశారు. తెలుగులో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమాలు తీయాలన్న సంకల్పం ఆయనను ‘స్వయంకృషి’ వైపు నడిపించింది. 1987లో ఈ సినిమా కొత్త చిరంజీవిని ప్రజలకు పరిచయం చేసింది. చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రను మెగాస్టార్ చిరంజీవి అంగీకరించడమూ సాహసమే. మెగాస్టార్ చిరంజీవికి ఉత్తమ నటుడిగా మొదటిసారిగా నంది అవార్డును ప్రసాదించిన సినిమా ఇది. మెగాస్టార్ లోని నట విశ్వరూపాన్ని మరోసారి ‘అపద్భాంధవుడు’గా చూపారు. తన కుమారుడు ఏడిద శ్రీరాంను హీరోగా చేసి తీసిన ‘స్వరకల్పన’ అవేరేజ్ గా ఆడింది .
ఇలాంటి అభిరుచి గల నిర్మాతలను రఘుపతి వెంకయ్య , పద్మపురస్కారాలతో సత్కరించడం చాలా అవసరం.  కీర్తిశేషులు అయ్యాక కూడా ఇవి ఇవ్వచ్చు . ఆయన మన ముందు లేకపోయినా ఆయన నిర్మించిన సినిమాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి.. మనల్ని పరవశింపజేస్తూనే ఉంటాయి.

“ పూర్ణోదయా”  ఆణిముత్యాలు 

సిరి సిరి మువ్వ
తాయారమ్మ బంగారయ్య 
శంకరాభరణం
సీతాకోకచిలక 
సాగర సంగమం 
స్వాతిముత్యం  
సితార 
స్వయంకృషి
స్వరకల్పన
ఆపత్బాంధవుడు
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండ

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

  తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా  కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు.  ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.