స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు,
తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..
పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.
తీవ్రభయాందోళనకు గురయిన పరిసర ప్రాంతాల ప్రజలు
ఎలాంటి అనుమతులు లేకుండా గోదాములు ఏర్పాటు
రంగారెడ్డి :శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి గగన్ పహాడ్ లోని ఓ మెడివేస్ట్ స్క్రాప్ దుకాణం లో అగ్నిప్రమాదం, పేలుడు. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.పేలుడు ధాటికి అందులో పనిచేస్తున్న పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు పోలీసులు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది.మంటలు ఆర్పి స్క్రాప్ దుకాణం లో చిక్కుకున్న వారిని రక్షించిన సిబ్బంది. గాయపడిన వారిలో అందరూ యువకులే. రాయల్, అస్లమ్, సద్దాం, అఫ్తాబ్, కమల్, సాహిల్, ప్రతాప్ సింగ్, మామా లను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.
స్క్రాప్ దుకాణం ఎస్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ యజమాని మహ్మద్ బాబుద్దీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాబుద్దీన్ గత కొన్నేళ్లుగా గగన్ పహడులో స్క్రాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా ఇటీవల కొంతకాలంగా గడువుతీరిన మెడికల్ వేస్టేజ్ ను కొనుగోలు చేసి బాటిల్స్ ను వేరు చేస్తున్నాడు. గడువు తీరిన మందులను యదేచ్చగా పారబోస్తున్నాడు.
గత రాత్రి మెడికల్ వేస్టేజ్ వద్ద మంటలు అంటుకొని అందులో ఉన్న సిలిండర్ కాస్త పేలిపోయింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రభయాందోళనకు లోనయ్యారు.
అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పీయడంతో తీవ్ర ప్రమాదం తప్పింది. గోదాం లో ఉన్న మెడికల్ వేస్ట్ మంటల బారిన పడితే విషవాయులు వెలువడి పరిసర ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవి.
జనావాసాల సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన ఇలాంటి గోదాములు ఏర్పాటు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్క్రాప్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.
కామెంట్‌లు