' మనంసైతం' ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం హైదరాబాద్: 'కాదంబరి ఫౌండేషన్-మనంసైతం' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షుర్ (Shure) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని ఎల్ఐజీ ప్రాంగణంలో రెనోవా హాస్పిటల్ విద్యానగర్ వారి సహకారంతో 'కాదంబరి ఫౌండేషన్-మనంసైతం' సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 'కాదంబరి ఫౌండేషన్-మనంసైతం' సంస్థ నిర్వహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ''ఆరోగ్యమే మహాభాగ్యం.. ఎవరికైనా మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ఈ పండగ రోజున ప్రముఖ ఆస్పత్రుల డాక్టర్లతో కలిసి ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాము. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆశీస్సులతో ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టాము. గత 10 సంవత్సరాలలో 50 వేల మంది నిస్సాహయులకు మా ఫౌండేషన్...
ఆకట్టుకుంటున్న ఓరి పిల్లడా సాంగ్ తెలుగు సినీ, మ్యూజిక్ లవర్స్ టేస్ట్ మారుతుంది. క్లాస్ మ్యూజిక్, ఇప్పుడు బోర్ కొడుతోంది. పాప్ సాంగ్స్ కన్నా, ఫోక్ సాంగ్స్ మీద మనసుపారేసుకుంటున్నారు జనాలు. పార్టీ సాంగ్స్ కన్నా మసాలా బీట్స్ కే ఎక్కువ ఎట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. అందుకే ఈ మద్య కంపోజర్స్ అందరూ ఫోక్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన మ్యూజిషియన్స్ మాస్ మసాలా బీట్స్ మీద బాగా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఆడియన్స్ లో కాస్త జోష్ నింపేందుకు ఫోక్ మీద ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా వెంకీ రొంపెల్లి నాయకుడిగా శిల్పా యాదవ్ నాయికగా ఓరి పిల్లడా అంటూ సాగుతున్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు. జేహెచ్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నోమిక నిర్మాతగా వ్యవహరించిన ఈ సాంగ్ ని గాయత్రి ఆలపించారు. అర్మాన్ మెరుగు లిరిక్స్ అందించడంతో పాటు సంగీతం అందించిన ఈ సాంగ్ కి కమ్లీ పటేల్ కెమెరా హ్యాండిల్ చేయగా నమృత్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ సాంగ్ ఆద్యంతం శ్రోతలను మాత్రమే కాదు వీక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.. బోడుప్పల్ పిల్ల యూట్యూబ్ ఛానల్ లో ర...