‘ఏ ఎల్ సి సి’ సినిమా బిగ్ టికెట్ లాంచ్ వేడుకను ప్రముఖ దర్శకుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు! యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో JP నవీన్ మాట్లాడుతూ.. ''ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికి కృతజ్ఞతలు. ఒక యంగ్ స్టర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా హీరోగా ఎంట్రీ అవ్వడం అంటే చాలా కష్టం. అది మీ మీడియా వారికి బాగా తెలుసు. నాలాంటి వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు లేలీధర్ రావు గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. మాలాంటి కొత్తవాళ్ళని దయచేసి సపోర్ట్ చెయ్యండి." అని అన్నారు. హీరోయిన్ శ్రావణి శెట్టి మాట్లాడుతూ.. "ముందుగా స్టేజి మీద ఉన్న పెద్దలందరికి నా నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన లేలీధర్ రావు గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. లేలీధర్ రావు గారు ఒక టీచర్.. అలాంటిద...
we give exclusive cinema news and all major political news also