ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని “క“ సినిమా ఇచ్చింది - బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం*


 *మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని “క“ సినిమా ఇచ్చింది - బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం*

థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం మూవీ “క“. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ "క" సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయగా..మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై డిస్ట్రిబ్యూట్ చేశారు. దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ ఈటీవీ విన్ లో డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో స్ట్రీమింగ్ కు వచ్చి అక్కడా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. అతి తక్కువ టైమ్ లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఈ సందర్భంగా  “క“ బ్లాక్ బస్టర్ ధమాకా ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ - మా క సినిమాకు థియేటర్స్ లో వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ ఇప్పుడు ఈటీవీ విన్ లో రావడం సంతోషంగా ఉంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీతో క ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. డాల్బీలో చూస్తే సీన్స్ లోని ప్రతి డీటెయిలింగ్ బాగా తెలుస్తుంది. అలాగే అట్మాస్ లో సౌండ్ ను క్లియర్ గా వింటూ దాని థీమ్ ను అర్థం చేసుకుంటారు.  ఈ సినిమా విషయంలో మాకు కిరణ్ గారు, ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేం. ఆడియెన్స్ కు మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

దర్శకుడు సందీప్ మాట్లాడుతూ - క సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమా ఇంతబాగా రావడానికి కారణం కిరణ్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ గారు. గ్రాండ్ రిలీజ్ చేసి సినిమాను అందరికీ రీచ్ చేశారు వంశీ నందిపాటి గారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ క సినిమా సక్సెస్ కు కారణం. థియేటర్స్ లో ఇచ్చిన ఘన విజయాన్ని ఈటీవీ విన్ లో కూడా ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో మా మూవీ మరింత ఎఫెక్టివ్ గా మీకు సినిమాటిక్ ఎక్సిపీరియన్స్  ఇస్తుంది. అన్నారు.

ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ - క సినిమాను థియేటర్స్ లో చూసినప్పుడు ఈ మూవీ తప్పకుండా ఈటీవీ విన్ కు తీసుకోవాలని అనుకున్నాం. అయితే కొత్తగా ఎలా ప్రెజెంట్ చేయొచ్చని ఆలోచించినప్పుడు డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో తీసుకురావాలని కిరణ్ గారితో డిస్కస్ చేసి నిర్ణయించాం. ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తక్కువ టైమ్ లో 100 మిలియన్ మినట్స్ వ్యూయర్ షిప్ దక్కడం సంతోషంగా ఉంది. మీరంత క సినిమాను ఈటీవీ విన్ లో తప్పకుండా చూడండి. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - క సినిమాకు మేము ఎంతగా ప్రమోషన్ చేశామో, ఈటీవీ విన్ టీమ్ అంతా అంతే ప్రమోషన్ చేసి ఆడియెన్స్ కు సినిమా బాగా రీచ్ అయ్యేలా చేస్తున్నారు. పైరసీ అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరి ఇంటికి క సినిమాను చేర్చారు. ఈటీవీ విన్ టీమ్ బాపినీడు గారు, సాయి కృష్ణ ఇతర అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. అలాగే డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా క కావడం విశేషం. అందుకు చాలా సంతోషంగా ఉంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో మా సినిమా మరింత డీటెయిలింగ్ గా సౌండ్, విజువల్స్ మరింతగా ఆకట్టుకుంటాయి. థియేటర్ లో క సినిమా చూసిన వాళ్లు కూడా మరోసారి ఈటీవీ విన్ లో చూడండి. ఎందుకంటే సెకండ్ టైమ్ ఇంకా బాగా అనిపించింది అని చాలామంది చెబుతున్నారు. క సినిమా సక్సెస్ కు మా ప్రొడ్యూసర్ గోపి గారు, డైరెక్టర్స్ సందీప్, సుజీత్, డిస్ట్రిబ్యూటర్ వంశీ గారు..ఇలా ప్రతి ఒక్కరూ కారణం. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మంచి సినిమా చేస్తే ఆడియెన్స్ ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని క సినిమా ఇచ్చింది. అన్నారు.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ - శ్రీ వరప్రసాద్

డీవోపీస్ - విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం

మ్యూజిక్ - సామ్ సీఎస్

ప్రొడక్షన్ డిజైనర్ - సుధీర్ మాచర్ల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చవాన్

క్రియేటివ్ ప్రొడ్యూసర్ - రితికేష్ గోరక్

లైన్ ప్రొడ్యూసర్ - కేఎల్ మదన్

సీయీవో - రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)

కాస్ట్యూమ్స్ - అనూష పుంజ్ల

మేకప్ - కొవ్వాడ రామకృష్ణ

ఫైట్స్ - రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్

కొరియోగ్రఫీ - పొలాకి విజయ్

వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్

వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - ఫణిరాజా కస్తూరి

కో ప్రొడ్యూసర్స్ - చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి

ప్రొడ్యూసర్ - చింతా గోపాలకృష్ణ రెడ్డి

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

రచన దర్శకత్వం - సుజీత్, సందీప్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య...