ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

55వ IFFIలో 'మా కాళి' హై ప్రొఫైల్ వరల్డ్ ప్రీమియర్‌కు హాజరైన గోవా సిఎం ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్


 55వ IFFIలో 'మా కాళి' హై ప్రొఫైల్ వరల్డ్ ప్రీమియర్‌కు హాజరైన గోవా సిఎం ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్  


నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్‌హిట్ చిత్రం కార్తికేయ 2 నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అప్ కమింగ్ మల్టీ లింగ్వల్ మూవీ 'మా కాళి' 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఆఫ్ ఇండియా (IFFI) వరల్డ్ ప్రీమియర్ కి  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌తో పాటు నిర్మాత శ్రీమతి వందనా ప్రసాద్, దర్శకుడు విజయ్ యెలకంటి, లీడ్ యాక్టర్ అభిషేక్ సింగ్, డిజిపి గోవా పోలీస్ అలోక్ కుమార్ IPS హాజరయ్యారు.


మా కాళి ప్రీమియర్ ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. భారతీయ చరిత్రలో చెరిపివేయబడిన అధ్యాయం ఆధారంగా, మా కాళి శక్తివంతమైన కథ, ప్రభావవంతమైన పెర్ఫార్మెన్స్ లతో బెంగాల్‌లోని అన్‌టోల్డ్ చాప్టర్స్ ని ప్రజెంట్ చేస్తోంది. 


కలకత్తా, నోఖాలీలో జరిగిన క్రూరమైన నరమేధ రక్తపాత సత్యాన్ని హైలైట్ చేస్తూ, భారతదేశ విభజనకు దారితీసిన డైరెక్ట్ యాక్షన్ డే వెనుక ఉన్న సత్యాన్ని ముందుకు తీసుకురావాలనేది మా కాళి లక్ష్యం. 


మా కాళి సోషియో-పోలిటికల్ సబ్జెక్ట్ ప్రస్తుత కాలంలోని అత్యంత ముఖ్యమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 1946 నుండి నేటి బంగ్లాదేశ్ వరకు హిందువులను పీడించడం, బెంగాల్ మతపరమైన అల్లకల్లోలాలను చిత్రీకరిస్తూ, మా కాళి Citizen Amendment Act (CAA)  ప్రాముఖ్యతను, దాని అమలు యొక్క అవసరాన్ని కూడా హైలైట్ చేస్తుంది.


ప్రీమియర్ షోలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ చిత్రం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు, “మా కాళి వరల్డ్ ప్రీమియర్‌లో, సినిమాని మొదటి వీక్షకులుగా చిత్ర బృందంతో పాటు ప్రేక్షకులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా కాళి భారతదేశ విభజన,  డైరెక్ట్ యాక్షన్ డే ఆధారంగా రూపొందించబడింది, యాదృచ్ఛికంగా, ఈ చిత్రం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రదర్శించబడింది. మన దేశం 1947లో స్వాతంత్ర్యం పొంది, కొన్నేళ్లకు ఇండియా, పాకిస్థాన్‌గా మారింది, తర్వాత 1971 నాటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌గా మారింది, ఒక దేశం మూడు ముక్కలైంది, అయినప్పటికీ, భారతదేశం మాత్రమే ఇప్పటికీ రాజ్యాంగాన్ని నమ్ముతుంది, ప్రాముఖ్యత ఇస్తుంది. బంగ్లాదేశ్‌లోని సామాజిక-రాజకీయ పరిస్థితులతో పాటు పాకిస్తాన్‌లోని రాజకీయ వాతావరణం గురించి మనందరికీ బాగా తెలుసు. మరోవైపు, భారతదేశం తన పౌరుడి అభివృద్ధిని విశ్వసిస్తుంది, తోటి పౌరుల మద్దతు  నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నేను ఇటీవల బంగ్లాదేశ్‌ను సందర్శించాను. మైనారిటీలు అంటే హిందువుల పరిస్థితులను స్వయంగా చూశాను. మా కాళి నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది. చాలా తక్కువ మందికి నిజం చెప్పే ధైర్యం ఉంటుంది, కాబట్టి నేను చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్ట్ యాక్షన్ డే అనేది మన దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే.  నేడు, పౌరసవరణ చట్టం (CAA), మేము ఆ మైనారిటీలను భారతదేశానికి తిరిగి తీసుకురాగలుగుతున్నాము' అన్నారు 


గౌరవనీయులైన ముఖ్యమంత్రి  టీమ్‌ను అభినందిస్తూ సోషల్ లో పోస్ట్ లో చేశారు .

https://x.com/drpramodpsawant/status/1861460668588920924?s=48&t=83QHyhN0lWxEv9ySfFHwjQ


ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రానికి వచ్చిన రెస్పాన్స్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ దర్శకుడు విజయ్ యెలకంటి మాట్లాడారు. “ఐఎఫ్‌ఎఫ్‌ఐలో మా చిత్రాన్ని ప్రదర్శించడమే కాకుండా, గోవా గౌరవ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జీ,  బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ జీ నుండి వచ్చిన ప్రశంసలు సత్కారంగా భావిస్తున్నాం. ఇది  మా కాళి టీమ్ మొత్తానికి గర్వంగా, సంతృప్తిగా ఉంది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదల కోసం మేము ఎదురుచూస్తున్నాము.


అభిషేక్ సింగ్ మాట్లాడుతూ“ఇటువంటి ప్రతిష్టాత్మక వేదిక వద్ద మా ప్రయత్నాలను గుర్తించడం , ప్రశంసించడం ఒక గొప్ప అనుభూతి. మా కాళి చాలా ముఖ్యమైన చిత్రం, ముఖ్యంగా నేటి ప్రేక్షకులు భావోద్వేగాలతో ప్రతిధ్వనించినందుకు , మాపై వారి ప్రేమను కురిపించినందుకు మేము సంతోషిస్తున్నాము' అన్నారు 


నిర్మాత వందనా ప్రసాద్ గారు గోవాలోని 55వ ఐఎఫ్‌ఎఫ్‌ఐలో జరిగిన మా కాళి ప్రీమియర్‌లో సినిమాకి ప్రోత్సాహాన్ని అందించిన గౌరవనీయమైన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన కథలను తెరపైకి తీసుకురావడానికి తమ నిబద్ధతను తెలియజేశారు.  


విజయ్ యెలకంటి రచన,  దర్శకత్వం వహించిన మా కాళిని TG విశ్వ ప్రసాద్ నిర్మించారు, కార్తికేయ 2 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సమర్పిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం హిందీలో చిత్రీకరించబడింది,  బెంగాలీ, తెలుగులో   2025లో థియేటర్లలో విడుదల కానుంది.


తారాగణం: రైమా సేన్, అభిషేక్ సింగ్

సిబ్బంది:

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్ 

రచన & దర్శకత్వం: విజయ్ యెలకంటి 

క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్

సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల

D.O.P: ఆచార్య వేణు

ప్రొడక్షన్ డిజైనర్: కిరణ్ కుమార్ మన్నె

సంగీతం: అనురాగ్ హల్డర్

ఎడిటర్: కిరణ్ గంటి

డైలాగ్స్: అమర్నాథ్ ఝా

ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: రూషిన్ దలాల్ & కైజాద్ గెర్డా

లిరిసిస్ట్: కునాల్ వర్మ

యాక్షన్: వింగ్ చున్ అంజి

కాస్ట్యూమ్స్: ఆశా గొందూరు

సౌండ్ డిజైనర్: J.R. ఇతిరాజ్

ఆర్ట్ : అబిస్టా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గురు శరణ్ యండమూరి

కో డైరెక్టర్: శ్రీ నివాస్ డి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య...