హీరో సిద్ధార్థ్ ''మిస్ యు'' నవంబర్ 29న థియేటర్స్ లో విడుదల, గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ !!!
హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సిద్ధార్థ్ తో పాటు హీరోయిన్ ఆశిక రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ...
నా తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. మిస్ యు సినిమా నాకు చాలా ప్రేత్యేకం, డైరెక్టర్ రాజశేఖర్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా రోజుల తరువాత ఒక క్యూట్ లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. గిబ్రాన్ ఈ సినిమా కోసం ఎనిమిది సూపర్బ్ ట్యూన్స్ ఇచ్చారు. మ్యూజికల్ లవ్ స్టొరీ గా మిస్ యు సినిమా నవంబర్ 29న థియేటర్స్ లో రాబోతోంది. ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది, ఆడియన్స్ తప్పకుండా ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకుంటారని అనిపిస్తుంది. ఈ చిత్ర నిర్మాత శామ్యూల్ మాత్యుస్ డైరెక్టర్ రాజశేఖర్ అడిగింది ఇచ్చారు, సినిమాను మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్ తో నిర్మించారు, మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత, ఈ జననేషన్ లో ఉన్న యంగ్ స్టర్స్ కు ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతారు, అన్ని ఎలిమెంట్స్ తో మిస్ యు సినిమా రాబోతోంది. ఈ సినిమా తరువాత నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి. మిస్ యు సినిమాను తెలుగులో నవంబర్ 29న రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ సంస్థ కు ప్రేత్యేక కృతజ్ఞతలు. త్వరలో మరిన్ని మంచి సినిమాలతో మీముందుకు రాబోతున్నాను అన్నారు.
లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్దార్థ్ మునుపటిలా తనలోని రొమాంటిక్ వైబ్స్ చూపించబోతున్నాడు. అదే విధంగా ఈ చిత్ర కథ ఫీల్ గుడ్ కంటెంట్ తో ఉండబోతోంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ.. ప్రేమలో ఉన్న బలహీనతల చుట్టూ ఈ చిత్ర కథ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. బ్రేకప్ తర్వాత కూడా ప్రేమ ఎంత బలంగా మారుతుందో అని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
ఈ చిత్రంలో జెపి, పోన్వన్నన్, బాల శరవణన్, కరుణాకరన్ లాంటి నటులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. కేజీ వెంకటేష్ సినిమా టోగ్రాఫర్ గా వ్యవహరించారు. సంగీతంతో పాటు సినిమాలోని విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి అని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రేమలో సెకండ్ ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎంటర్టైనింగ్ గా అదే సమయంలో ఎమోషనల్ గా చెప్పినట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు. నవంబర్ 29న రిలీజ్ అవుతున్న మిస్ యు చిత్రాన్ని ఏషియన్ సురేష్ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది.
కామెంట్‌లు