సహకరించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు
హైదరాబాద్, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని గత రాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన ప్రమాద సంఘటనలు జరగలేదని, ఇందుకుగాను స్వీయ నియంత్రణతో ట్రాఫిక్ నిబందనలను పాటించి పోలీస్ శాఖ కు సహకరించిన రాష్ట్ర ప్రజలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఎం. మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటి నుంచి హైదరాబాద్ నగరంలో గాని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గాని ప్రమాద సంఘటనలు జరగలేదని తెలిపారు. ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రమాద రహితoగా నిర్వహించడంలో సమర్డవంతంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులు,సిబ్బందిని డీ.జీ.పీ అభినందించారు.
సీ.ఎం. కే.సీ.ఆర్ ను కలసిన డీ.జీ.పీ
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ ను నేడు ప్రగతి భవన్ లో డీ.జీ.పీ. మహేందర్ రెడ్డి కలసి శుభాకాంక్షలు అందచెసారు. నేడు ప్రగతి భవన్ లో సీ.ఎం కె.సీ.ఆర్ ను కలసి పుష్పగుచ్హం అందచేసారు. అనంతరం గవర్నర్ తమిళ సై ను కూడా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందచేసారు. కాగా, నెడు ఉదయం పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో నిర్వహించిన ఒక కార్యక్రమం లో డీ.జీ.పి కేక్ ను కాట చేసి నూతన సంవత్సర వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కామెంట్‌లు