రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉత్సాహంలో మునిగిన కొంతమంది యువతను అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. కొత్త సంవత్సర వేడుకల్లో కొంతమంది యువకులు పార్టీలు చేసుకొని ఇండ్లలోకి వెళ్తున్న క్రమంలో రోడ్లపై ఉన్న పోలీసులు అడ్డుకొని చితకబాదారు. కర్రలతో దాడి చేయడంతో పాటు, కొంతమంది పోలీసులు ఎగిరి, ఎగిరి తన్నిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మత్తులో ఉన్న యువకులు ఒకవేళ దురుసుగా ప్రవర్తిస్తూ, వారి ఇంటికి గాని లేదా పోలీస్ స్టేషన్ కు గాని తరలించాల్సి ఉన్నప్పటికీ చేయి చేసుకోవడం ఫ్రెండ్లీ పోలీస్ కు అర్థం లేకుండా పోతుందని, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
* శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"* యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు.. *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...
కామెంట్‌లు