కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం కేసీఆర్ లేఖ
పార్లమెంటులోనూ, బయటా దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ, వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ...తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రెవెన్యూ, ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం సమీక్షలో ప్రస్తావించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా తక్కువగా వచ్చిందని సీఎం తెలిపారు..పన్నుల వాటా ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
రాష్టానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటా తగ్గిందని సీఎం సమావేశంలో అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని సీఎం తెలిపారు. పన్నుల వాటా గణనీయంగా తగ్గినందున అన్ని శాఖలకు నిధులు తగ్గించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఖర్చులపై అన్ని శాఖల్లోనూ స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం సూచించారు .
కామెంట్‌లు