ఆర్టీసీ కార్మికులంతా రేపు విధుల్లో చేరండి సీఎం కేసీఆర్
కార్మికులు విధుల్లో చేరేందుకు ఎలాంటి కండీషన్లు పెట్టం
యూనియన్ల ఉన్మాదంలో పడి..
కార్మికులు బతుకులను ఆగం చేసుకోవద్దు
కార్మికులు ఉద్యోగాలు కాపాడు కోండి
ఆర్టీసీకి రూ.100 కోట్లు ఇస్తున్నాం
ఆర్టీసీ ఛార్జీలు పెంచుకోవచ్చు -
కి.మీ 20పైసలు చొప్పున పెంచుకోవచ్చు
రూట్ల పర్మిట్లను వ్యాపారులకు ఇవ్వం -
నేరుగా ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి..
సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం -
ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలే
చనిపోయిన కార్మికుల కుటుంబాల నుంచి..
అర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తాం
యూనియన్లకు బదులుగా..
వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఉండాలి
యూనియన్ల ఉన్మాదంలో పడి..
కార్మికులు బతుకులను ఆగం చేసుకోవద్దు
యూనియన్లకు బదులుగా..
వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఉండాలి
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రికే చంద్రశేఖరరావు శుభ వార్త అందించారు. రేపు విధుల్లో సంతోషంగా చేరాలని ఆదేశించారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరొచ్చని తెలిపారు ఆర్టీసీ ప్రైవేటుపరం చేయబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కోలుకునేందుకు తాత్కాలికంగా వంద కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కార్మిక సంఘాలను క్షమించబోమని అన్నారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా యిచ్చారు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు.
సీఎం కేసీఆర్ ప్రయాణికులపై భారం మోపారు.టిక్కెట్ చార్జీలు పెంచారు. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతున్నట్టు తెలిపారు. పెంచిన టికేట్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి..
కామెంట్‌లు