అర్జున్ సురవరం చిత్రం మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది, నవంవర్ 29న గ్రాండ్ రిలీజ్ - హీరో నిఖిల్
హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.సంతోష్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా 'అర్జున్ సురవరం'. కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడిన ఈ చిత్రం చివరికి నవంబర్ 29 న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ప్రేక్షకుల సమక్షంలో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ..
అర్జున్ సురవరం చిత్రం మేము ఎంతో శ్రమించి చేశాము. అన్యాయం ఎదిరించే ఒక రిపోటర్ పాత్రలో నేను నటించాను. చిత్ర నిర్మాణం సమయంలో నిర్మాతలు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ సంతోష్ అద్భుతంగా ఈ సినిమా తీశాడు. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో బాగా నటించింది, తన రోల్ అందరికి గుర్తుండిపోతుంది. సినిమాను థియేటర్ లొనే చూడండి, థియేటర్ లో చూస్తేనే ఈ సినిమా ఫీల్ తెలుస్తుంది, అందుచేతనే ట్రైలర్ కూడా థియేటర్ లొనే ప్లే చేశాము. నవంవర్ 29న వస్తున్న మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి అన్నారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ...
అర్జున్ సురవరం ట్రైలర్ ఇలా థియేటర్ లో ఆడియన్స్ మధ్య విడుదలవ్వడం థ్రిల్లింగ్ గా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది,మీ అందరికి నచ్చే విధంగా ఈ మూవీ ఉండబోతోంది, ట్రైలర్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ సినిమాను థియేటర్ కు వచ్చి చూడండి, నా పై మీ ప్రేమ ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్న అన్నారు.
డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ...
నిఖిల్ తో వర్క్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. సినిమా చిత్రీకరణ సందర్భంలో సహకరించిన అందరికి స్పెషల్ థాంక్స్. నిర్మాత ఠాగూర్ మధు గారు నన్ను బాగా సపోర్ట్ చేశారు. మంచి మెసేజ్ తో పాటు కమర్సియల్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. నాకు, నిఖిల్ కు మా చిత్ర యూనిట్ సభ్యులకు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను. నవంబర్ 29న విడుదల కాబోతున్న మా అర్జున్ సురవరం సినిమాను మీ అందరూ చూసి హిట్ చేస్తారని భావిస్తున్నాను అన్నారు.
నటీనటులు:
నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: టి.సంతోష్
సమర్పణ: ఠాగూర్ మధు
బ్యానర్: మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి
నిర్మాత: రాజ్‌కుమార్ అకెళ్ల
సంగీతం: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
పి.ఆర్.ఒ: వంశీశేఖర్
కామెంట్‌లు