ఆర్టీసీ జెఎసి చేసిన ప్రకటన హాస్యాస్పదం.....ఆర్టీసీ యండి సునీల్ శర్మ
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగిస్తే కఠిన చర్యలు
52 రోజులు సమ్మే చేసి రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఎసి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఆర్టీసీ యండి సునీల్ శర్మ మండి పడ్డారు...తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై,ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం ఏంటని సునీల్ శర్మ ప్రశ్నించారు ...బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారంటూ తీవ్రంగా తప్పు పట్టారు...రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని, బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దని . ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు..అన్ని డిపోల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తామని తెలిపారు..కార్మికులు ఇప్పుడు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుంది. ..అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుంది..కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట వినినష్టపోయారు. ఇక ముందు కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దు.
కామెంట్‌లు