ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అశ్వత్థామరెడ్డిని బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తరలించే సమయంలో పోలీసులకు ఆర్టీసీ కార్మికులు మద్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఇరువర్గాల మద్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అశ్వత్థామరెడ్డిని ఆయన నివాసం నుంచి పోలీస్ వాహనంలో వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు
* శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"* యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు.. *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...
కామెంట్‌లు